బాస్ పై నా ప్రేమను చూపించే టైమ్ వచ్చేసింది

సంచలన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా మెగా ఛాన్స్ కొట్టిన విషయం విదితమే. చిరంజీవి – మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ కు మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేసాడు. ఈ నేపథ్యంలో తమన్ ఎమోషనల్ అయ్యాడు. ”ఏ కంపోజర్ కైనా కూడా ఇది బిగెస్ట్ డ్రీమ్. బాస్ పై నా ప్రేమను చూపించే టైమ్ వచ్చేసింది. తెలుగు లూసిఫర్‌తో మా జర్నీ మొదలు కాబోతోంది” అని పేర్కొన్నారు.

చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న (బుధవారం) ప్రారంభమైంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.