ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకొని కంచికచర్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ వివక్షకు తావు లేకుండా ప్రతీ భారతీయుడికి సముచిత హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు డా.బాబాసాహెబ్ అంబేద్కర్. నేడు ఆయన జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అంబేద్కర్ స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని, ఆయన యొక్క జీవితాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందాలని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు రమాదేవి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను నేటికి స్మరించుకుంటోందనీ రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దేవి రెడ్డి శ్రీనివాసరావు, తోట ఓంకార్, పురమా కాళేశ్వరరావు, తిరుమల రావు, చంటి, ప్రభాకర్, నరసింహారావు, బత్తుల కృష్ణ మరియు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment