అన్నసంతర్పణ కార్యక్రమములో పాల్గొన్న తంగెళ్ళ శ్రీనివాస్

పిఠాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ వాకాతిప్పా గ్రామంలో వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమములో పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమములో పాల్గొని ఉత్సాహంగా గ్రామస్థులు కు వడ్డీస్తూ వారితో కాసేపు ముచ్చట్టించారు. అనంతరం గ్రామంలో వివిధ వర్గాల ప్రతినిధులుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.