‘థ్యాంక్యూ బ్రదర్‌’.. మోషన్ పోస్టర్ విడుదల చేసిన మహేష్‌బాబు

‘థ్యాంక్యూ బ్రదర్‌’ థిల్లర్ ఎంటర్టైనర్ తో వస్తున్న ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, మౌనిక రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఇటీవల చిత్ర పోస్టర్‌ను సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించగా.. అందరినీ ఆకట్టుకొంది.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘థ్యాంక్ యూ బ్రదర్’ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ అంతా భయంకరమైన శబ్ధాలతో ఉండగా అనసూయ, అశ్విన్ లిఫ్ట్‌లో ఇరుక్కొని భయంతో చూస్తున్నారు. ఇంతకి లిఫ్ట్ లో అనసూయ ఎందుకు ఇరుక్కుంది. అసలేం జరిగిందనేది తెలియాలంటే ‘థ్యాంక్యూ బ్రదర్‌’ సినిమా చూడాల్సిందే. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామ్ ఫిల్మ్‌గా ‘థ్యాంక్ యు బ్రదర్‌’ను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారు.