‘థ్యాంక్ యు బ్రదర్’ పోస్టర్

తాజాగా హీరో రానా దగ్గుబాటి మాస్క్ పెట్టుకోవాలని చెబుతూ ఓ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోలో షూటింగ్ లొకేషన్‌లో ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా కనిపిస్తే ‘మాస్క్ పెట్టుకో’ అని చెప్పడం.. మాస్క్ పెట్టుకున్న తర్వాత అతను ‘థ్యాంక్ యు బ్రదర్’ అని చెప్పడం హైలెట్‌గా ఉన్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఇదేదో కరోనా నుంచి రక్షించే క్యాంపెయిన్ అనుకున్నారు. కానీ ఆ వీడియో వెనుక పెద్ద కథే ఉందని తాజాగా రానా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

తాజా ట్వీట్‌తో ఇది కరోనా రక్షణకు చేసే క్యాంపెయిన్ కాదని.. ఇదొక సినిమా పేరని తెలిసింది. అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన తారాగణంగా జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేష్ రాపర్తి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. కరోనా సమయంలో జరిగిన కొన్ని కాల్పనిక కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను సినీ నటుడు రానా దగ్గుబాటి లాంచ్ చేశారు. ఒక లిఫ్ట్ వద్ద మాస్క్ కింద పడిన దృశ్యం పోస్టర్ లో ఉంది. ఈ చిత్రానికి రమేశ్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న డ్రామా ఫిల్మ్ ఇది. మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.