వారాహి యాత్ర విజయవంతం చేసిన ప్రజలందరికి ధన్యవాదాలు

  • జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన జనంలోకి జనసేనన.. జనసేన వారాహి యాత్ర విజయోత్సవంలో భాగంగా శనివారం శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పశ్చిమగోదావరి జిల్లాలో మునుపేప్పుడూ జరగని భారీ సభ మన తాడేపల్లిగూడెంలో జరిగిందన్నారు. ఈ వారాహి యాత్రలో భాగంగా భారీ బైక్ ర్యాలీలో స్వచ్ఛందంగా ప్రతి జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు
పాలుపంచుకోవడం అభినందనీయం అన్నారు. అంతే కాకుండా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ముఖ్య లక్ష్యం వైసీపీ వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరిమికొట్టడమే. ఇటీవల ఈ వారాహి రథయాత్రను రెండవ దశను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ పార్టీల్లో ఒకటిగా ఎదగడంతోపాటు జగన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విలువల గురించి మాట్లాడుతుంటే వైసీపీ నేతలు ఆయన తల్లి, ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నారని బొలిశెట్టి ఫైర్ అయ్యారు. 2024లో జగన్ మరియు మన మంత్రి ఈ రాష్ట్రానికి అనవసరంమని తెలిపారు. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలనలో చాలా అవినీతి జరిగిందని రాష్ట్రానికి వైసీపీ పార్టీ సరైనది కాదని బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. అనంతరం పెంటపాడు మండల వీరమహిళా అధ్యక్షులు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షులు వేజ్జు రత్నకుమారి, తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్యక్షులు వర్తనపల్లి కాశి, లైజనింగ్ కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా సభ్యులు, వీరమహిళలు మరియు జనసేన నాయకులు, జనసైనికులందరు కలిసి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కి చిరు సత్కారం చేయడం జరిగింది.