- జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ మిని కుంభమేళాలా సాగింది..!
- నారా లోకేష్ ఓ కంకణ బద్ధుడై, పోరాటం చేస్తూ… అదే విధంగా మంగళగిరి అభివృద్ధి చేస్తున్నారు.
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… పిఠాపురం చిత్రాడలో జరిగిన 12వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ముఖ్యంగా జనసైనికులు, వీర మహిళలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు పోలీస్ సిబ్బంది & మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన ఆవిర్భావం నుండి నేటి వరకు పోరాటాలతోనే ప్రజలకు చేరువయ్యామని అన్నారు. రాజ్యాధికారం వచ్చినంత మాత్రాన తామేమి ప్రజలకు దూరం కాలేదని వైసిపి వ్యతిరేక ఓటు చీలగూడదన్న ఉద్దేశంతోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నాడు కలిసి బిజెపితో కూటమిగా ఏర్పడిందని వైసిపి వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకతను చీలగూడదన్న సదుస్దేశంతో కూటమి ఏర్పడిందని అన్నారు. వైసిపి ద్రోహులు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభను నేతలు చేసిన వ్యాఖ్యలను విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ట్రాప్ లో ఎవరు పడవద్దు అని, విభజన ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లు డబ్బులు దాచుకోవటం దోచుకోవటానికి వైసిపి ప్రయత్నాలు చేసిందని రాష్ట్ర భవిష్యత్తు 10 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందని ఆయన ఆరోపించారు. జనసేన ఆవిర్భావ సభ పైశాచిక ఆనందంతో వైసిపి శ్రేణులు తాత్కాలిక సంతోషమే తప్ప ఆ పార్టీ ప్రజలకు చేరువ కాలేదని అన్నారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ అభివృద్ధిపై కంకణ బద్ధులై ఉన్నారని దానిలో భాగంగానే వంద పడకల ఆసుపత్రి, పేదలకు ఇల్లు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, స్వర్ణకార సంక్షేమం, బస్టాండ్, కమ్యూనిటీ హాల్స్, రక్షత మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాల అభివృదే నిదర్శనం అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో జనసేన నేతలు వ్యాఖ్యలు సదుద్దేశంతో ఆలోచించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలే శిరోధార్యం అని అన్నారు. భవిష్యత్తుకు బాట వేసేలా కార్యాచరణ చేస్తూ, దిశానిర్దేశం చేస్తున్న ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి వినూత్నరీతిలో సేవలను అందిస్తూ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకపాత్ర పోషించి దేశస్థాయి నాయకులుగా ఎదిగారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇంకో 15 సంవత్సరాలు అయిన ఉండాలని కోరుకుంటున్నారని కళ్యాణ్ చెప్పారంటే, అది ఆయన దార్శనికతకు నిదర్శనం అని అన్నారు. గత ఐదేళ్ల పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో తెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, జనసేన నాయకులు జొన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment