ఆ వార్త‌లు వాస్తవం కాదు: శ్రద్ధాదాస్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్ వీరే అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌డం ప్రారంభ‌మైయాయి. ఇందులో శ్ర‌ద్ధాదాస్ పాల్గొంటారు అంటూ వార్త‌లు వినిపించాయి. ఆమె ఆ వార్త‌లన‌ ఖండించినా ఆగ‌లేదు. దీంతో శ్ర‌ద్ధాదాస్ ట్విట్ట‌ర్ ద్వారా వివ‌ర‌ణ ఇవ్వగా… బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను చూసి చాలా మంది నన్ను అడుగుతున్నారు. జ‌ర్న‌లిస్టులు ఇలాంటి వార్త‌లు రాసేముందు క్లారిటీ తీసుకుంటే బావుంటుంది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. అస‌త్య‌పు వార్త‌లు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకోడానికి వెనుకాడబోను’’ అన్నారు శ్ర‌ద్ధాదాస్‌. మ‌రిప్పుడైనా శ్ర‌ద్ధాపై అస‌త్య‌పు వార్త‌లు ఆగుతాయేమో చూడాలి.