*చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జనసేన జెండా ఆవిష్కరణ
*ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర రావు
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కష్టసమయాల్లో పార్టీకి తోడు ఉంటూ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు పవన్ కళ్యాణ్ వెన్నంటి నడచిన జనసైనికులంతా చిత్రాడ పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభకు తరలి రావాలని ఆ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు కోరారు. చిల్లకూరు మండలం తమ్మినపత్నం గ్రామంలో నాయకులు శివాజీ, రవి, మహేష్ ఆధ్వర్యంలో గురువారం జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామస్థాయిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరూ మార్చి 14న జరిగే ఆవిర్భవ సభకు విజయోత్సవంతో హాజరు కావాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామనీ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను అలాగే డిప్యూటీ సి.ఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికీ తెలియచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం పి.ఓ.సి మోహన్ మాట్లాడుతూ ఆవిర్భావ సభకు వచ్చే కార్యకర్తల వివరాలు, వాహన సదుపాయాలపై మండల నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో చిన్న జనసేన, నాయకులు క్రాంతి, కార్తీక్, సునీల్, సుధీర్, శ్రీనివాసులు, మధు, సాయి కిరణ్, హరికృష్ణ, వెంకటేశ్వర్లు, నాగుర్, వేణు, రాజు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment