జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుకు సచివాలయ సిబ్బంది చూపే లెక్కలకు ఏమాత్రం పొంతన లేదు

  • రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహించిన జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత 14వ తేది మూడవ రోజు సోషల్ ఆడిట్లో భాగంగా అనంతపురం అర్భన్ నియోజకవర్గం నారాయణపురం పంచాయతీలోని 1,2 వ సచివాలయాలకి వెళ్లి సదరు గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంపిక అనుసరించిన విధానాలు ఏమిటి, ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎంత మేరకు బిల్లులు మంజూరు చేశారు. వంటి విషయాలను సచివాలయ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పసుపులేటి పద్మావతి, అనంతపురం జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, అనంతపురం రూరల్ కన్వీనర్ గంటా రామాంజనేయులు, వీరమహిళలు శ్రీమతి శైలజ, శ్రీమతి కుళ్ళయమ్మ, శ్రీమతి దార్బి, శ్రీమతి అనసూయ, శ్రీమతి యమున నాయకులు పామురాయి వెంకటేష్, గణేష్, పూజారి పవన్ తదితరులు పాల్గొనడం జరిగింది.