యుగపురుషుడు, మరణం లేని వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్: గాదె

గుంటూరు: భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ వీరికి నివాళులు అర్పించడం జరిగింది. ఒక యుగపురుషుడు, మరణం లేనటువంటి వ్యక్తికి వర్ధంతి చేస్తున్నాము. కానీ వాస్తవానికి వర్ధంతి లేని వ్యక్తి మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఈ దేశంలో అలాంటి మహానుభావుడు పుట్టటం మనము అదృష్టంగా భావించాలి. ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగంలోనే ఈ రోజుకు కూడా యావత్ భారతదేశం ముందుకు వెళ్ళడానికి కారణం అవుతుంది. ఆయన చెప్పిన సూక్తులు తూచా తప్పకుండా మనం పాటించాలి అంతేకానీ జన్మదినాలకు, వర్ధంతులకు దండలు వేసి నివాళులు అర్పించడం కాదు అని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆయన బతికి ఉన్నప్పుడు చెప్పారు నేను చనిపోయిన తరువాత నా విగ్రహాలు పెట్టి విగ్రహరాధనలు చేయవద్దు నేను చెప్పినవి ఆచరించి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలకు మేము చెప్పేది ఒక్కటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణిద్దాం అప్పుడే వారికి నిజమైన నివాళులు మనము ఇచ్చిన వాళ్ళము అవుతామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు, కార్పొరేటర్లు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..