గ్రామ గ్రామాన జనసేన బలోపేతమే లక్ష్యం

  • తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు

తిరువూరు నియోజకవర్గం: తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు ఏ కొండూరు మండలంలో శుక్రవారం పలు గ్రామాల్లో పర్యటించి జనసైనికులను కలిసి పార్టీ బలోపేతం గురించి దిశా నిర్దేశం చేసారు. పల్లె పల్లెకు జనసేన జెండా కార్యక్రమంలో భాగంగా మండలంలోని రామచంద్రపురం, అట్ల ప్రగడ, కోడూరు, కోడూరు దళితవాడ, రేపూడి, ఏ.కొండూరు, కొండూరు అడ్డరోడ్డు తండా పలుగ్రామాల్లో పర్యటించి జనసేన నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రతి జనసైనికుడు ఓటర్ లిస్టులో ఓటు ఉందో లేదో పరిశీలించుకోవాలని, ఓటర్ లిస్టులో ఉన్న దొంగ ఓట్లపై దృష్టి పెట్టి ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు పార్టీ దృష్టికి తీసుకురావాలని, 18 సంవత్సరాల నిండిన యువతను గుర్తించి కొత్త ఓటర్ లుగా చేర్పించాలని, త్వరలో గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని జనసేన భావజాలాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని యువతకు ఈ సందర్భంగా మండల కార్యవర్గ సభ్యులతో కలిసి మనుబోలు శ్రీనివాసరావు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లాకవతు విజయ్, మండల కార్యవర్గ సభ్యులు ముదిగండ్ల సాయి కృష్ణ, వెంపాటి యేసయ్య, పసుపులేటి సతీష్, తూము సాయి, తోటపూల హరీష్, కిరణ్, కోట నవీన్ వంశీ అఖిల్, వెంకటయ్య, బానోతు రఘు, చిరంజీవి, మరియు పలు గ్రామాల జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.