గ్రామ స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లడమే ద్యేయం: డా.యుగంధర్ పొన్న

కార్వేటి నగరం మండలం, గాజంకి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జనసైనికుల జనసేన కార్యక్రమం” నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన జనసేన పార్టీలో చేరికలు మొదలయ్యాయి అని, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేసి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజం చేయడానికి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులను కార్యకర్తలుగా, కార్యకర్తల నాయకులుగా తయారుచేసి వారిని గొప్ప నాయకుడి వారిని గొప్ప నాయకులుగా చేసి ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమని, ఆయన సారధ్యంలోనే గ్రామాల్లో, పట్టణాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద అపోజి జనసేన పార్టీలో చేరారు. గ్రామంలో కొంతమంది పెద్దలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొజ్జయ్య పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, మండల ప్రధాన కార్యదర్సులు చంద్రమౌళి, నరేష్ ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటినగరం టౌన్ కమిటీ ప్రెసిడెంట్ భాను చందర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర, జనసేన పార్టీ నాయకులు శేఖర్, లోకయ్య, భాస్కర్, అబ్రహం, షారోన్, యాశ్వంత్, జస్వంత్, జేమ్స్, సింహాద్రి, నాగరాజు, చిరంజీవి గ్రామ పెద్దలు అప్పోజయ్య, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, లక్ష్మయ్య, జనసైనికులు, వీరమహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.