భారతీయుల జీవితంలో భాగమైన సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా శ్రీరాముని శోభయాత్ర జరగనుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఈ నెల ఆరవ తేదీ జరగనున్న శ్రీరామనవమి మహోత్సవ శోభాయాత్రకు సంభందించి కమిటీ సభ్యులైన బ్రహ్మారెడ్డి, లక్ష్మి, జానకి ,యస్వంత్ లతో అయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి మొదలయ్యే ఈ శోభాయాత్రలో పాల్గొనటం తమ గురుతర బాధ్యతగా అందరూ భావించాలన్నారు. హిందూ ధార్మిక, సాంస్కృతిక, సామాజిక ఐక్యతకు ప్రతీకగా ఈ శోభాయాత్ర నిలిస్తుందన్నారు. శ్రీరాముని ధర్మ నిరతి, సత్యశీలత భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహత పడతాయన్నారు. భిన్న ప్రాంతాలు, భిన్న వర్గాలకు చెందిన ప్రజలు కలిసి జరుపుకునే ఇలాంటి ఉత్సవాల నిర్వహణ ద్వారా సోదర భావం పెరుగుతుందన్నారు. భారీ రధాలతో పాటూ శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి వార్లను ప్రతిబింబించేలా వేషధారణలతో అత్యంత వైభోపేతంగా జరగనున్న శోభాయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొనాలని ఆళ్ళ హరి ప్రజలను కోరారు.
Share this content:
Post Comment