జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే కూటమి లక్ష్యం

నెల్లూరు: జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే కూటమి లక్ష్యమని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు తెలిపారు. చిట్టమూరు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిల్లమూరు పంచాయతీ, రామాపురం గ్రామంలో బుధవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కి మరోసారి ఓటు వేస్తె ప్రజల ఆస్తులు గాల్లో దీపంగా మారడం ఖాయమని, వైసిపి హయంలో వ్యవసాయం చేసే రైతులు నష్టాల్లో ఉంటే, గంజాయి పండించే వైకాపా నాయకులు లాభాల్లో ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యధేచ్చగా గంజాయి విక్రయాలతో యువత మత్తుకు బానిసలవుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్,గంజాయి మాఫియాను అరికడతామన్నారు. రాష్ట్ర ప్రజల చేతిలో జగన్ కు పరాభవం తప్పదని మే 13 జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ రావుకు కమలం గుర్తు పై, గూడూరు ఎంఎల్ఏ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కు సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోను క్రాంతి కుమార్, చెన్నుమాటి అక్బర్ కుమార్, చెన్నపనేని వేణు, కుదురు రాము, కాటేపల్లి వంశి, ఇలియాజ్, ఏంభేటీ ప్రవీణ్, చీమలదిన్నె పెంచలయ్య, మధన్, మునీంద్రా , హరీష్, శ్రీను, దినేష్, శ్రీను, చెంచు, సుబ్రమణ్యం, శ్రీను, విజయ్, భూపయ్య, ముత్తు, సూర్య, వినయ్, ముద్దు కృష్ణ, కళ్యాణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.