పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి

అమలాపురంలో కే.ఎస్.ఎస్ యువత విభాగానికి సంబంధించి కొత్తపేట మండల బాడీ, అమలాపురం రూరల్ మండల బాడీ, అల్లవరం మండల అధ్యక్షులు, కార్యదర్శి మరియు జిల్లా సంయుక్త కార్యదర్శిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా యువత విభాగం అధ్యక్షులు డి.ఎస్.ఎన్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు చేగొండి నాని, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోనం గణేష్ కుమార్ ల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోలకోటి చిన్న, అమలాపురం నియోజకవర్గం మండల అధ్యక్షులు కానిపుడి రమేష్ మరియు కార్యవర్గం, కొత్తపేట మండల అధ్యక్షులు దూలం సాయి ప్రసాద్ మరియు కార్యవర్గం, అల్లవరం మండల అధ్యక్షులు ఆర్.కె నాయుడు మరియు కార్యవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన యువత విభాగం పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.