రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుంది

*బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్

మదనపల్లె, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యపై పోరాటం సాగిస్తున్నారని, రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ పేర్కొన్నారు. ‌ఆదివారం మదనపల్లె పర్యటనలో భాగంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి స్వగృహానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, డాక్టర్ సుబ్బారెడ్డి, బండి ఆనంద్, రేవతి, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి అడపా సురేంద్ర, రెడ్డెమ్మ, పద్దు టైగర్, గజ్జెల రెడ్డెప్ప, పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్, గంగారపు రామదాస్ చౌదరి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగి వ్వక్తి నరేంద్ర మోడీ, ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కితాబునిచ్చారు. ‌ప్రజ సమస్యలపై పోరాటం చేయడంలో పవన్ కళ్యాణ్ అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు ఉన్నారు.‌ భవిష్యత్తులో జనసేన, బిజెపి పొత్తు కొనసాగుతుంది. ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందని, మరోవైపు రాబడిపై అప్పులు చేస్తూ భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, బిజెపి జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా జంగాల శివరామ్ రాయల్, సురేంద్ర, పద్మావతి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ‌