బీసీల లక్ష రూపాయల పథకానికి దరఖాస్తుల గడువు పెంచాలి

  • బిసిలంటే చులకనే
  • అధికారులు పట్టించుకోరు ప్రజాప్రతినిధులకు మేము అక్కర్లేదు

భైంసా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు లక్ష రూపాయల సబ్సిడీ లోన్ ఇస్తామని గొప్పలు చెప్పి షరతులు పెట్టి అతి తక్కువ సమయం కేటాయించి, దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. కాని దేవుడు వరమిచ్చి పూజారి అడ్డు పడ్డట్టు అధికారుల పని తీరు అస్సలు బాగా లేకపోవడాన్ని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు పడుతున్న అవస్తలు అంత, ఇంత కాదు. పనులు అన్నీ వదులుకొని తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు లేక చెట్ల కింద సేద తీరే పరిస్థితి దాపురించింది. దానికి తోడు నెట్వర్క్ రావడం లేదు అని అధికారులు చెప్పే సరికి భాదతో వెనుదిరిగి వెళ్తున్నారు. అదేవిధంగా మీ సేవా సెంటర్లలో హార్ట్ కాపీ పేపర్లు లేకపోవడంతో మండల, మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తులు తీసుకోవడం లేదు. ఒక పక్క సమయం మించి పోతుంది, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇట్టి సమస్యను కలెక్టర్ గారు స్పందించి సమస్యకు మార్గం చూపి న్యాయం చేయాలని కోరుతున్నామని, అలాగే ప్రభుత్వం వెంటనే గడువు తేదీని పొడిగించాలని డిమాండ్ చేసారు.