వైసీపి ప్రభుత్వ నిరంకుశ ధోరణిని నిరసిస్తూ రాజమండ్రి జనసేన ధర్నా

రాజమండ్రి: పన్నుల పేరుతో సామాన్యుల స్ధలాలు కబ్జాలు చేస్తున్న వైసీపి ప్రభుత్వ నిరంకుశ ధోరణిని జనసేన పార్టీ తీవ్రంగా నిరసిస్తూ, సామాన్యులకు అండగా రాజమండ్రి ముస్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ స్థలాల్లో పన్నులు పేరుతో ఈ ప్రభుత్వం పాల్పడుతున్న కబ్జాలకు మరియు సామాన్యులను బెదిరిస్తూ వార్డు సచివాలయాలు కడతాం అంటూ నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులకు నిరసన తెలియజేస్తూ గురువారం జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, జిల్లా కార్యవర్గం, జనసేన నాయకులు ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చేరుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం ఈ సమస్యని అక్కడ ఉన్నత అధికారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, ఇతర జనసేననాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నారాయణ గౌడ్ బోడపాటి రాజేశ్వరి, జామి సత్యనారాయణ, తేజోమూర్తులు, గెడ్డంనాగరాజు, రాజమండ్రి నగర కమిటీ సభ్యులు, దాసరి గురునాధం, రాజేష్ ఖన్నా గుత్తుల సత్యనారాయణ, వెంకట పైడిరాజు, అల్లంకి నాగేశ్వరావు, షేక్ భాషా, నల్లంశెట్టి వీరబాబు, కప్పల ప్రకాష్, అల్లాటి రాజు, సురేష్ నాయుడు, ముమ్మిడి భాగ్యలక్ష్మి, యంధం ఇందిరా, అసూరి సుధాకర్, విన్న వాసు, చలపతి, గుణ్ణం శ్యాంసుందర్, చక్రాఫణి, చైతన్య, భాషీర్, కెల్ల.జయలక్ష్మి, పాలిక సతీష్, ఠాగూరు, పివివి సత్యనారాయణ మరియు నగర జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు భారీ ఎత్తున పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది.