గడపగడపకి అయోధ్య శ్రీరామ అక్షింతలు

అమలాపురం: గొల్లవిల్లి గ్రామంలో సన్నాయి వాయిద్యాలతో సంపూర్ణంగా గడపగడపకి అయోధ్య శ్రీరామ అక్షింతలు, కరపత్రం, అయోధ్య చిత్ర ఫోటో, ఇచ్చి అందరికీ వివరణ చెప్పడం జరిగింది. అందరికీ జనవరి 22న 12.31 నిమిషములకు అక్షింతలు అందరూ కూడా శిరస్సును ధరించాలని సాయంత్రం ఐదు దీపాలు వెలిగించాలని అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శిరంగు నాయుడు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అరిగెల నానాజీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు యెరుబండి భద్రం, పైపూడి వీరేంద్ర, మద్దింశెట్టి ప్రసాద్, వైఎస్ఆర్ సీపీ నాయకులు శివాజీ, మరియు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.