జనసేన పిలుపుతో బంద్ విజయవంతం

  • ధన్యవాదాలు తెలియజేసిన దాసరి రాజు

ఇచ్చారం, ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి దాసరి రాజు మాట్లాడుతూ సోమవారం నాడు ఇచ్చాపురం మున్సిపాలిటీ లో బంద్ ని చేశాం. ఈ బంద్ విజయవంతం కి కారణమైన బ్యాంక్స్ వారికి, ఆటో యూనియన్స్, కార్ యూనియన్స్,రి క్షా యూనియన్స్, పత్రికా సోదరులకు, పోలిస్ డిపార్ట్మెంట్ కి, వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, ప్రజలకు జనసేన తరుపున ధన్యవాదాలు తెలియజేసారు. డిసిహెచెస్ కి నమస్కరించి తెలియజేయినది ఏమనగా అయ్యా ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. వైద్యం కోసం ప్రజలు ఎంత కష్ట పడుతున్నారో, ఎంత విసుగు చెందరో అర్థం చేసుకోండి. స్వచ్ఛందగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా బంద్ చేశారు.ఈ విషయాన్నీ మీరు గ్రహించాలి.ఈ బంద్ ఫలితంగా సిహెచ్సి హాస్పిటల్ లో ఇద్దరు డాక్టర్స్ ని డెప్యూటషన్ లో వేశారు.సంతోషం కానీ రెగ్యులర్ డాక్టర్స్ ని స్టాఫ్ ని వేయాలి. అలానే ఇంక్యుబ్లేటర్స్, ఆల్ట్రాస్కానింగ్ మిషన్లు నిరూపోయాగం ఉన్నాయి. వెంటనే అవి అందుబాటులో కి తీసుకొచ్చి దానికి సంబంధించిన డాక్టర్స్ ని,టెక్నిషన్స్ ని నియమించాలి. ఫిర్యాదుల పెట్టె ఉండాలి.100 శాతం వైద్యం ఇక్కడే జరగాలి.అన్ని సిహెచ్సి లో ఇదే విధమైన వైద్య సదుపాయ ఉండాలి. 24 గంటలు వైద్య సదుపాయం అన్ని సిహెచ్సి లో ఉండాలి.మిగతా సిహెచ్సి లకు మా జనసేన తరుపున ఇచ్ఛాపురం ఇంచార్జి గా ఉన్న నేను వెళ్లి సందర్శించి రిపోర్ట్ ని కలెక్టర్ కి, డిసిహెచెస్ కి రెండు రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. మిగతా సిహెచ్సి లో వైద్యం పూర్తిగా జరగని యడల ప్రజలతరుపున జనసేన ఇంకా ఉద్యమంగా పోరాడుతుంది. ఈ బంద్ కి నాకు సపోర్టు చేసిన జనసై నీకులకు జనసేన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధనరెడ్డి, భాస్కర్, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.