భూలక్ష్మికి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయల చెక్ అందజేసిన బత్తుల దంపతులు

రాజమహేంద్రవరం, ఎల్లప్పుడూ నిరంతర సేవా కార్యక్రమాలు జరిపే జైన్ సేవా‌‌ సమితి వారు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.‌ వాటిలో భాగంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి బత్తుల ప్రశంగిస్తూ.. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇంత భారీస్థాయిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జైన్ సేవా సమితి సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తదానం యెక్క ఆవశ్యకతను సభా ముఖంగా వివరించారు. బోన్ మ్యారో వలన బాధపడుతున్న చిన్నారి రాజా భూ లక్ష్మీ కి వైద్య సహాయ నిమిత్తం లక్ష రూపాయలను అందిస్తానని బత్తుల బలరామకృష్ణ సీతానగరం మండలం నా సేన నా వంతు కార్యక్రమంలో హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఉదయం రాజమహేంద్రవరంలో జైన్ సేవా‌‌ సమితి వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో చిన్నారి కుటుంబానికి లక్ష రూపాయల చెక్కుని అందించిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులు. అనంతరం బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… పాప వైద్యానికి సంబంధించిన అన్ని విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని.. చిన్నారి తొందర్లోనే కోలుకోవాలని ఆశిస్తూ… జనసైనికులు, సేవా దృక్పథం ఉన్నవారంతా అందరూ చిన్నారి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుణ్యక్షేత్రం బాబులు, బదిరెడ్డి దొరగారు, కర్రి దొర, అడ్డాల దొర, అడ్డాల దుర్గాప్రసాద్, బోయిన వెంకటేష్, అడ్డాల శ్రీనివాస్, యర్రంశెట్టి శ్రీను, వేగిశెట్టి రాజు, నాదిపాము దొరబాబు, అరిగెల రామకృష్ణ, పాత వెలుగుబంద గోపాలం, గంగిశెట్టి రాజేంద్ర, చిక్కిరెడ్డి ముని ప్రసాద్, తోట అనిల్ వాసు తదితర నాయకులు వీర మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.