జనసేనతోనే ఉత్తమ భవిష్యత్తు: రాటాల రామయ్య
సిద్ధవటం: జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ భావజాలం తెలియాలనే ఉద్దేశ్యంతో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాలమేరకు ఇంటింటికి జనసేన10 వరోజులో భాగంగా సిద్ధవటం మండలంలోని కనుమలోపల్లి, శేఖరాజుపల్లె గ్రామాలలో జనసేన పార్టీ సిద్ధాంతాలతో ఉన్న కరపత్రాలను అందజేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ యువ నాయకుడు నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు, చంగల్ రాయుడు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-29-at-9.00.27-AM-787x1024.jpeg)