కాళ్ళు, చేతులు లేకపోయినా తన అద్భుతమైన కళతో ఆశ్చర్యపరుస్తున్న బాలుడు..!

కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు 11 సంవత్సరాలు గల బాలుడు మధు. చేతులు, కాళ్లు లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని అందరికి ఆద‌ర్శంగా నిలిచాడు ఈ బాలుడు. చేతులు, కాళ్లు లేకపోయినప్పటికీ తన నోటి సహాయంతో అద్భుతమైన పెయింటింగ్స్ వేసి అందరి ప్రశంసలను పొందుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి మండ‌లం క‌మ్‌కోలే గ్రామానికి చెందిన ప్రమీల, తుల్జారామ్‌ కుమారుడు మధు.ఈ బాలుడికి గడిచిన ఏడాది వారి ఇంటిపై ఆడుకుంటున్న సమయంలో తన చేతిలో ఉన్న ఇనుప రాడ్ విద్యుత్ తీగలు తగలడంతో షాక్ రావడంతో అ బాలుడి రెండు చేతులు కాళ్లకు తీవ్ర గాయాలు అవ్వడంతో చివరికి వైద్యులు వాటిని తొలగించాలని తెలియజేశారు.

మధు పరిస్థితి తెలుసుకున్న అరిక‌పూడి రఘు నేరుగా వారి ఇంటికి వెళ్లి తన వంతు సహాయం చేస్తానని, ఆ బాలుడికి అండగా ఉంటానని వారికి ధైర్యం ఇచ్చాడు. అంతేకాకుండా మధు పెయింటింగ్ లో కొంతకాలం పాటు రఘు శిక్షణ ఇస్తూ అండగా నిలిచాడు. నోరు సహాయంతో అక్షరాలు రాయడం, పెయింటింగ్ వేయడం లాంటి చాలా సులువుగా రఘు ఆ బాలుడికి నేర్పించారు. ఇలా ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి అవడం తర్వాత మధు తన నోరు సహాయంతో పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాడు అలాగే రాయడం కూడా ప్రారంభించాడు.

మధు ఉన్న టాలెంట్ కు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయిపోయారు అంటే నమ్మండి. ఇటీవలే ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో నిర్వహిస్తున్న సామ్ జామ్ ప్రోగ్రామ్ కు ఆ బాలుడిని ఆహ్వానం అందింది.

సామ్ జామ్ షో లో భాగంగా చిరంజీవి ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో మధుని లైవ్ లోకి పిలిపించి అక్కడే చిరు ఫోటోను పెయింటింగ్ కూడా వేయించింది సమం త.దీనితో మధు వేసిన ఫోటోతో చిరు చాలా ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సామ్ జామ్ నిర్వాహకులు ఆ బాలుడికి రూ.50 వేల నగదు బహుమతిని అందజేసింది అండగా నిలిచారు. ఇలాంటి వారు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే వారికి కూడా చేయూతనిచ్చి ఇలాంటి వారిని తయారు చేయండి.