ముఖ్యమంత్రి ఆదివాసి జాతికి ఎం హామీ ఇచ్చారు

పాడేరు: ముఖ్యమంత్రి జగన్ ఆదివాసి గడ్డపై వచ్చి జాతికి ఎం హామీ ఇచ్చారని పాడేరు నియోజకవర్గ రూరల్ జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ స్థానిక నాయకులకు ప్రజల తరపున ఒకటే ప్రశ్న.. మన ప్రాంతంలో కో కొల్లలుగా సమస్యలు నిండి ఉన్నాయి, మొన్నకి మొన్న తుపాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన గిరిజన రైతులకష్టాలను మీ అధినేత దృష్టికి ప్రజల ముందు వివరించారా, డిమాండ్ చేశారా, సాటి జాతికి తెలియజేయండి, ప్రజాధనం వృధా చేయటం ఎఒతవరకు సమంజసం, సభలో వెచ్చించిన సొమ్ము, పంట నష్టపోయిన రైతులకిచ్చి ఆదుకోవడం వదిలేసి వృధా చేస్తారా.. ప్రజలకి కచ్చితంగా సమాధానం చెప్పాలి. జనబలాన్ని చూపించుకోవడం కోసం డ్వాక్రా మహిళలకు బయబ్రంతులకి గురిచేసి, వందలాది బుస్స్ లను మైదాన ప్రాంతం నుండి, తీసుకొచ్చి సచివాలయం సాప్ట్ ద్వారా, గ్రామ వాలంటరీ ల ద్వారా.. జనాలను సభలో తరిలించడం న్యాయమా, చదువుకునే పిల్లకు సైతం విలువైన సమయాన్ని వృధా చేయటం ద్వారా మీరు ఏం సాధించారు, ఇది చట్టరీత్యా నేరం కాదా..? సీఎం వస్తున్నారు ఏదో హామీ ఇస్తాడు అని పుట్టెడుఆశతో తరలి వచ్చిన ఆదివాసి గిరిజన జనంగానికి ఎం హామీ ఇచ్చారు. మీ మేహర్బానికే, వచ్చింది ఓట్ల ప్రయోజనాల కోసమే అని స్పష్టంగా కనిపిస్తుంది, ట్యూబ్ లను ఇవ్వడానికే ఇంత కర్చుపెట్టి ఇక్కడ దాకా రావాలా. అమరావతి లోనే… బటన్ నొక్కి ఓపెన్ చేయవచ్చుకదా. మీ అధినేత ద్వారా గిరి రైతులకు ఎం బరోసా కల్పించారు, స్థానిక నాయకుల్లారా, స్థానిక సమస్యలను సీఎం గారికి దృష్టికి తెలియజేదామని, ముందుకెళ్ళిన నాయకులను హౌస్ అరెస్ట్ లు చేయటం, భాష వాలంటరీ లయొక్క సమస్యలను సీఎం ఎదుట తెలియ జేద్దామని ప్రయత్నించిన ఎక్స్ ఎంపీపీ బాబు రావు లాంటి సొంత పార్టీ వాళ్లని సైతం వివక్షత చూపించి పోలీస్ ల ద్వారా బయటకు లాక్కెళ్లడం ఇదెక్కడి ప్రజాసామ్యాఒ, దీన్ని మేము జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలను చుట్టాలుగా మార్చి, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాసామ్యాన్ని పాతరేసిందని కిల్లో రాజన్ మండి పడ్డారు. ఆఖరికి సభలో వచ్చిన జనం సరియైనసౌకర్యాలు లేక ఇబ్బందులు పడి తిరిగి ఇంటికెళ్ళా ల్సిన, పరిస్థితివచ్చిందని అన్నారు, వీరమహిళలు, సంఘీభావం తెలుపడం జరిగింది.