మాట తప్పను మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి నేడు ప్రతి విషయంలోను మాట తప్పుతునే ఉన్నాడు: గాదె

సత్తెనపల్లి నియోజకవర్గం రూరల్ మండలం కంకనాలపల్లి పంచాయతీ పరిధిలోని వావిలాలనగర్లో జరిగిన కుంభాభిషేకం కార్యక్రమానికి జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణలతో కలిసి సత్తెనపల్లి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే సిపిఎస్ రద్దుచేస్తానని చెప్పి చేయకపోగా అటువంటి వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసి గెలిపించి అనంతరం మోసపోయామని గ్రహించిన ఉద్యోగస్తులు నేడు తమ హక్కులకోసం నోరుతెరిచి అడిగితే వారిని వేధిస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబు స్వయంగా మంత్రి అయ్యి ఉండి అభివృద్ధి విషయం పట్టించుకోకుండా అనవసర విషయాలన్నిటిలో తగుదునమ్మా అంటూ తలదూర్చి ప్రచారపిచ్చితో పరితపిస్తున్నారని గాదె అన్నారు. గడప గడపకు అంటూ తిరుగుతూ ప్రజలు పశ్నిస్తుంటే పారిపోతున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ… సత్తెనపల్లి ప్రాంతంలో రోడ్లు రాష్ట్రప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నాయని అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వ్యవహారం విన్నానని, పేరుకే వందపడకల ఆసుపత్రి తప్ప ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. రోగులను స్కానింగులకు, మందులకు బయటకు పంపి డాక్టర్లు అక్రమార్జనకు పాల్పడడం చూస్తుంటే ఇక్కడ మంత్రిగారి వలన ప్రజలకు కలిగే మేలు ఏంటని సందేహం కలుగుతోంది అని అన్నారు. అంతేకాక ఆరోగ్యమంత్రి, అందులోను ఒక మహిళ అయిన విడదల రజనీ కూతవేటు దూరంలో ఉండి సాటి గర్భిణీ స్త్రీలు, శిశువులు చనిపోతుంటే స్పందించకపోవడం అన్యాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిలాని, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య, నాదెండ్ల నాగేశ్వరరావు, శిరిగిరి పవన్ కుమార్, తాడువాయి లక్ష్మీ, పార్టీ కార్యాలయ ఇంఛార్జి శిరిగిరి మణికంఠ, కౌన్సిలర్ రంగిసెట్టి సుమన్, వీరమహిళలు నామా పుష్పాలత, తిరుమలశెట్టి మల్లీశ్వరి, చింతల అరుణ, జనసైనికులు రాట్నాల సోమశేఖర్, సెల్వకుమార్ మోహన్, తాడువాయి శ్రీను, సిసింద్రీ, సాంబ, ఎస్.కె గౌస్, ఎస్.కె ఖాజా, బిట్రగుంట కృష్ణారావు, చింతల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.