శ్రీవారికి సతీమణితో సహా సీఎం పట్టు వస్త్రాలు సమర్పించాలి

  • సినిమా స్టైల్ లో గుడిసెట్లు వేసి ప్రజలను మభ్య పెట్టడం కాదు
  • పోలీసులు ప్రతిపక్షాలను పండుగ రోజైనా హౌస్ అరెస్ట్లు చేయడం మానండి.. టీడీపీ, జనసేన

తిరుపతి: సీఎం జగన్మోహన్ రెడ్డికి శ్రీవారిపై నిజంగా భక్తి ఉంటే సీఎం ఆయన సతీమణితో సహా వచ్చి ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని జనసేన నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి, బత్తిన మధుబాబు, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, గుట్టా నాగరాజు, వంశీ, వినోద్, పార్ధు, కిషోర్, టిడిపి నేతలు ఆర్ సి ముని కృష్ణ, కరాటే చంద్ర లు మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ. స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జగన్ ను ఒప్పించి సతీమణి భారతితో సహా తిరుమల బ్రహ్మోత్సవాలకు విచ్చేసేలా చేయాలని, గత సంక్రాంతి పండుగకు సినిమా స్టైల్ లో సేట్లు వేసి మరి భక్తులు లా సీఎం దంపతులు ఫోటోలు రిలీజ్ చేసి ప్రజలను మభ్య పెట్టారని గుర్తు చేశారు. అలాగే తిరుపతి పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్షాలైన తమను ఈ వినాయక చవితి పండుగ రోజు అయినా సోమవారం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న సీఎం జగన్ భద్రత కోసం హౌస్ అరెస్టులు చేయడం విరమించుకుంటే తమ ఇంట్లో తాము వినాయక చవితిని జరుపుకుంటామని, తమ ఇంటి ముందు పోలీసులు ఉండడం బాగుండదని కిరణ్ చురకలు విసిరారు.