కూటమి ప్రభుత్వం నిజంగా చేనేతల ప్రభుత్వంగా నిలుస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా లోకేష్ చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్ అందిస్తామని మాట ఇచ్చి, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపడం ఎంతో హర్షణీయంగా ఉంది. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి వారికి చేయూత అందించడం ఒక గొప్ప నిర్ణయం. 2017 నుంచి చేనేతల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు అందిస్తుండగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా చర్యలు చేపట్టడం గర్వకారణం. చేనేత ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేయడం ఈ ప్రభుత్వ దృఢసంకల్పాన్ని చూపుతుంది. మంగళగిరి చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా చూశిన నారా లోకేష్ గారు ఆ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అమలు చేశారు. చేనేత కళాకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, చేనేత కార్మికులందరూ ఎన్.డి.ఏ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Share this content:
Post Comment