కమిషన్లకు కక్కుర్తి పడే దాళ్వా పంట ఇవ్వలేదు: ఎస్.వి.బాబు

పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్.వి.బాబు నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, రైతులకు ఎమ్మెల్యే జోగి రమేష్ చేస్తున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. ఆయన తెలియజేసిన ముఖ్యమైన సమస్యలు..

*పెడన నియోజకవర్గం అంటేనే వ్యవసాయ ఆధారత ప్రాంతం.

*90% ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.

*జోగి రమేష్ తాను గెలిస్తే ప్రతి సంవత్సరం దాల్వా పంట తీసుకొస్తానని మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా తర్వాత మంత్రిగా తాను ఎదిగి ఇప్పుడు రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు.

*కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి దాల్వా పంట లేకుండా చేశాడు జోగి

*పెడన నియోజవర్గం తీర ప్రాంతం కావడం వల్ల ఆక్వా కల్చర్ కూడా ఉంటుంది. ఎవరైనా చెరువు తోవ్వాలంటే ఎమ్మెల్యే కి కమిషన్ ఇవ్వవలసిందే

*ఒక్కో ఎకరం చెరువుకి 30000 నుండి 50 వేల వరకు కమిషన్ వసూలు చేస్తున్నట్టు వినికిడి

*దాళ్వా పంట లేకపోతే, రైతులు ఎక్కువగా ఆక్వా కల్చర్ వైపు మొగ్గు చూపుతారు. తద్వారా ఎక్కువ కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పెడన నియోజకవర్గానికి దాళ్వా లేకుండా చేసిన ఘనత జోగి రమేష్ ది

*కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో 1000 ఎకరాల పైచిలుకు చెరువులు తవ్వకానికి మంత్రి జోగి రమేష్ తో లోపాయి కారి ఒప్పందం జరిగిపోయింది అనేది నియోజకవర్గంలో హాట్ టాఫిక్

పెడన నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అపరాలు పండవు. ఇసుక భూములు ఎక్కువగా ఉంటాయి

*అంతేకాకుండా తీరప్రాంతం కావడం వలన దాళ్వా ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు

*పంట పొలాల్లో సెల్ నెట్ శాతం (ఉప్పు సాంద్రత) పెరిగిపోవడం వల్ల భూముల్లో సారవంతం లోపిస్తుంది

*కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు మరింత ఇబ్బందులకు గురవుతారు. వీరి జీవనోపాధి కృష్ణార్ధకమవుతుంది

*దాల్వపంట లేకపోవడం వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది

పై సమస్యలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గానికి దాళ్వా పంట ఇవ్వవలసిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని.. లేని పక్షాన రైతులతో మమేకమై ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అని ఎస్.వి.బాబు తెలియజేసారు.