రమణక్కపేట- కొండపర్వ రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి

  • వైసీపీ రివర్స్ టెండరింగ్ వల్ల రోడ్డు మీద పడిన రమణక్కపేట- కొండపర్వ రోడ్డు కాంట్రాక్టర్లు మద్యలో ఆపేసిన రోడ్లు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు

నూజివీడు నియోజకవర్గం: ముసునూరు మండల రమణక్కపేట నుండి విసన్నపేటకి రోడ్డుని కలుపుతూ కొండపర్వ మీదుగా గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన లింక్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని జనసేన నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు నిరసన తెలుపుతూ అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కంకరు వేసి, ఫినిషింగ్ దాదాపు పూర్తి చేసి రోడ్డు వేసే సమయంలో ఎన్నికల అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో రివర్స్ టెండర్ విధానం వల్ల ఇదే రోడ్డు నిర్మాణం కాకుండా రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఆగిపోయిన పనులు వల్ల నేటికీ అలానే మిగిలిపోయి బిల్లులు రాక అప్పులు చేసిన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే స్తితికి వచ్చారు అని జగన్ రెడ్డి మాట్లాడితే మూడు రాజధానులు నిర్మిస్తామని కబుర్లు చెప్పడం తప్ప కనీసం ఇలాంటి చిన్న చితక రోడ్లు కూడా వెయ్యడానికి నిధులు లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చాడు అని పాశం నాగబాబు విమర్శించాడు. అలానే ఐదేళ్ల క్రితం చివరి దశలో ఉన్న రోడ్లు కనీసం పూర్తి చేయలేని వైసీపీ ప్రభుత్వం చేతకాని తనం వల్ల రోడ్లు మీద ఉన్న కంకరురాళ్ళు వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అని అనేక సార్లు అధికారులకు తెలిపిన దీని మీద స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని కూల్చడం తప్ప కట్టడం రాని వైసీపీ ప్రభుత్వానికి ఇదే చివరి ఎన్నికలని రాబోయే ఎన్నికల్లో ప్రజలు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి పట్టం కట్టి ఎక్కడైతే రాష్ట్ర అభివృద్ధి పనులు అగిపోయాయో అక్కడ నుండే పున ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుతో పాటు గ్రామ, మండల నాయకులు వేట త్రినాథ్, ఉప్పే నరేంద్ర, అముదాల బాలరాజు, చేకూరి ప్రసాద్, సూర్య, బాలు, గుండాల శివ, నూకల పవన్, కేశవ తదితరులు పాల్గొన్నారు.