ప్రాణం ఖరీదు నాలుగున్నర లక్ష..!

గూడూరు నియోజకవర్గంలో మొన్న రుద్రవరం లో ఇసుక రీచ్ వద్ద గోతులలో పడి మృతి చెందిన బాధిత కుటుంబాలకి వైసిపీ నాయకుల అండతో నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చి కాంట్రాక్టర్ పై కేసు నమోదు కాకుండా చూశారు. మెట్టు నుంచి రుద్రవరం వెళ్లే రూట్లో దాదాపు 5 నెలల నుంచి తవ్విన ఇసుక లెక్క అధికారులకు ఊహకి అందనంత. యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా తరలిస్తూ గ్రామస్తులు రెండు మూడు సార్లు నిలదీస్తే సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారని కాంట్రాక్టర్లు బుకాయిస్తున్నారు. జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూడి సుధీర్ మరికొందరు జనసైనికులతో సంఘటన స్థలాన్ని చేరుకొని ఇసుక రవాణా అనుమతులు కోరగా చూపలేకపోయారు. గ్రామస్తులు గతంలో రెండు మూడు సార్లు వాటిని ఇసుక రవాణాన్ని నిలిపివేయడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. రోజుకి రోజుకు 100 ట్రాక్టర్ల పైబడి ఇష్టా రాజ్యంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ తరపున నమోదు ఉన్నా మూడు అడుగుల మించి తవ్వరాదు. దాదాపు 30 అడుగుల మించిన గుంతలు కిలోమీటర్ల మేర తవ్వి అక్రమంగా తరలిస్తున్న స్థానిక నాయకులకు అధికారులు కళ్లెం వేయలేకున్నారు. గత రెండు రోజుల నుంచి తవ్వకాలు కొద్దిగా తగ్గినా రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే వీటిని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. లేనియెడల రానున్న రోజులో జనసేన పార్టీ తరఫున గ్రామస్తులకు అండగా నిలబడి అక్రమ రవాణా ని అరికట్టేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం మృతి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్ట పరిహారం అందే విషయంలో అండగా నిలబడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ఖలీల్, వర్షన్, బాలాజీ, కేశవ తదితరులు పాల్గొన్నారు.