ఆళ్ళగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రోజు వైసీపీకి భారీ షాక్

  • శిరివెళ్ళ మండలం వాల్మీకి (బోయ)సంఘం అధ్యక్షులు బిఎంపి సుబ్బరాయుడు జనసేనలో చేరిక.
  • శిరివెళ్ళ మండలంలో వైసీపీకి భారీ షాక్
  • వైసిపి నుండి 150 కుటుంబాలు జనసేన లో చేరిక.
  • టిడిపి నుండి 50 కుటుంబాలు జనసేనలో చేరిక.

ఆళ్ళగడ్డ, శిరివెళ్ల కేంద్రంగా పసుల పేటలో శిరివెళ్ళ మండలం జనసైనికుల ఆత్మీయ సమావేశంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మైలేరి మల్లయ్య సమక్షంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి శిరివెళ్ళ మండలం వాల్మీకి(బోయ) సంఘం అధ్యక్షులు బిఎంపి సుబ్బారాయుడు మరియు శిరివెళ్ళ మండలానికి సంబంధించిన ఎస్సీ, బీసీ, మైనారిటీ సోదరుల కుటుంబాలు వైసిపి పార్టీ నుండి 150 కుటుంబాలు టిడిపి నుండి 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. అనంతరం మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మార్పు కోరుతూ బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా జనసేన పార్టీలో చేరిన కుటుంబాల అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వాల్మీకి (బోయ) సంఘం అధ్యక్షులు బిఎంపి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ల ముందు వాల్మీకులను (బోయ) ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మాట మార్చి వాల్మీకిలకు మోసం చేశాడని, నీతి నిజాయితీ నిబద్ధతగల పవన్ కళ్యాణ్ వెంట నడవాలని జనసేన పార్టీలో చేరారని తెలియజేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారము, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ అని తెలియజేశారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరిన కుటుంబాలను వైసిపి నాయకులు, మీరు జనసేన పార్టీలో చేరితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, వైసిపి నాయకులు బెదిరింపులకు ఎవరు భయపడవద్దని జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. జనసేన పార్టీలో చేరిన కుటుంబాలను బెదిరించే ముందు వైసీపీ నాయకుల కుటుంబంలోని పిల్లల ఓటు జనసేనకు పడకుండా ఆపగలరా అని తెలియజేశారు. సంక్షేమ పథకాలకు డబ్బులు వైసిపి నాయకులు ఆస్తులను అమ్మి ఇవ్వడంలేదని ప్రజలు కడుతున్నా ట్యాక్స్ (పన్ను) రూపంలో వచ్చిన డబ్బులను ప్రజలకు తిరిగి ఇస్తున్నారని ఇందులో వైసీపీ నాయకుల ఘనత ఏం లేదని తెలియజేశారు. వైసిపి, టిడిపి పార్టీలో ఉన్న నాయకులు మీరు ఉన్నా పార్టీలలో డబ్బు కోసమో, పదవుల కోసమో ఎదురు చూసి ఆత్మగౌరవాన్ని పోగొట్టు కోకండి, ఎందుకంటే డబ్బు కంటే పదవుల కంటే ఆత్మగౌరవం చాలా గొప్పది, జీవితంలో డబ్బు, పదవులు సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మగౌరవం అనేది తిరిగి తెచ్చుకోలేము అని తెలియజేసారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని 2024 సార్వత్రిక ఎలక్షన్లలో ఆళ్ళగడ్డలో జనసేన జెండా ఎగురవేయబోతున్నామని తెలియజేశారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో, జనవాణి కార్యక్రమమును వైసిపి ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్, బావికాడి గుర్రప్ప, షేక్ జమాల్ బాష, షేక్ షబ్బీర్ భాష, బండి రామచంద్రుడు, రాజశేఖర్, దూదేకుల సిద్దు, పల్లె సాగర్, భాస్కర్, సాయినాథ్, మద్దిలేటి యాదవ్, కుమ్మరి నాగేంద్ర, వెంకటసుబ్బయ్య, అమర్ కాంత్, చైతన్య, పగడాల నాగరాజు, శీను, కేశవ, నయమత్ ఖాన్, తిమ్మరాజు యాదవ్, విజయ్, కరుణాకర్ ఈశ్వరయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.