*రంగంలోకి ఎమ్మెల్యే బత్తుల
కోరుకొండ మండలం వెస్ట్ గానుగూడెం వద్ద సత్యసాయి వాటర్ పైప్లైన్ పగిలిపోయి 7 గ్రామాలు త్రాగునీటి సమస్యతో ఎదుర్కొంటున్నాయనే సమాచారం అందుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, ముళ్లకంపలు మధ్యనైనా చలించకుండా యుద్ధప్రాతిపదికపై మరమ్మత్తులు చేపట్టించారు. సంబంధిత అధికారులు, యంత్రాలు రంగంలోకి దిగి మరమ్మత్తులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో సత్యసాయి నీటి పథకాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతో నేడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విమర్శించారు. సొంత నిధులతోనే తాత్కాలిక మరమ్మత్తులు చేసి, సాయంత్రానికల్లా అన్ని గ్రామాలకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడ త్రాగునీటి సమస్య ఉన్నా, మధ్యాహ్నానికి పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్‌లో శాశ్వత పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు. అలాగే, 861 కోట్లతో గోదావరి జలాలపై ఆధారిత “జల జీవం మిషన్” ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని, అది అమలవుతే ప్రతి ఇంటికీ త్రాగునీరు చేరుతుందని తెలిపారు.
Share this content:
Post Comment