నిమ్మకాయల శ్రీరంగనాథ్ మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు

తెలుగు పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన నిమ్మకాయల శ్రీరంగనాథ్ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీరంగనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. పత్రికా రంగంలో వివిధ హోదాల్లో పని చేసి.. విషయ పరిజ్ఞానంతో విశ్లేషణ చేసేవారు. వర్తమాన సామాజిక, రాజకీయ రంగాలపై ఆయన రాసిన వ్యాసాలలో శ్రీరంగనాథ్ ప్రస్తావించిన అంశాలు ఆలోచింపజేసేవి. ముఖ్యంగా ఇరిగేషన్ అంశాలు, గోదావరి నది పరివాహక ప్రాజెక్టులు, డెల్టా ఆయకట్టుపై సాధికారికంగా విశ్లేషించి కథనాలు అందించారు. తరిమెల నాగిరెడ్డి రాసిన ఇండియా మార్టిగేజ్డ్ పుస్తకానికి తెలుగు అనువాదం ‘తాకట్టులో భారతదేశం’ రూపుదిద్దుకోవడంలో శ్రీరంగనాధ్ పాత్ర కూడా ఉందని సీనియర్ జర్నలిస్టుల ద్వారా తెలిసింది. ఆయన మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు. వారి కుమారుడు, పాత్రికేయుడు వంశీకి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.