ఎస్సైను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసారో ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి: డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, వెదురుకుప్ప మండలం తిప్పినాయుడు పల్లి గ్రామపంచాయతీ తిప్పినాయుడు పల్లి సదువుల సంఘమిత్ర భబితను తొలగించాలని నియోజకవర్గం ఇంచార్జి డ.యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తండ్రి ఎంపిటిసి, తన కుమార్తె విద్యనభ్యసిస్తూ సంఘమిత్ర ఉద్యోగం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. వారంలోపు ఉద్యోగం నుంచి తొలగించకపోతే జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తానని తెలిపారు. వెదురుకుప్ప మండలంలో మంచి ఎస్సైను ఎందుకు ట్రాన్స్ఫర్ చేసారో ఉప ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెదురుకుప్పం మండలానికి ఎస్సైని వెంటనే నియమించాలని డిమాండ్ చేసారు. అధికారుల చేత పని చేయించలేని అసమర్థుడు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అని, చట్టానికే సంకెళ్ళు వేస్తున్న స్వామి నిరంకుశత్వాన్ని ఖండిస్తున్నాని ఏద్దేవా చేసారు. కారు పెట్టి నగరం మండల కేంద్రం నుండి పచ్చికాపల్లం, వెదురుకుప్పం, మొరవ, దేవళంపేట మీదుగా నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేద్దామని జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు, పౌర సంఘాలకు, ప్రజా సంఘాలకు, అంబేద్కర్ యువజన సంఘాలకు, అభివృద్ధిని కోరుకునే ప్రతీ ఒక్కరికి పిలుపు నిచ్చారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను అరికడదామని, నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడుదామని తెలియజేసారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు అని, ఒక్కసారి అవకాశం ఇస్తే జనరంజక పాలన అందిస్తామని ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కోలార్ వెంకటేష్, రాఘవ, మండల సీనియర్ నాయకులు యాతిశ్వర్ రెడ్డి, మండల కార్యదర్శులు శరత్, రాజు, జనసైనికులు ఉన్నారు.