రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గెలుపుతోనే సాధ్యం: దొడ్డి గర్ల సువర్ణ రాజు

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండలం, చెరుకుమిల్లి గ్రామస్తులు జనసేన నియోజకవర్గ నాయకులు దొడ్డి గర్ల సువర్ణ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం జనసైనికులు మరియు కొత్తగా జనసేన పార్టీ యొక్క విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ఆయన అడుగుజాడల్లో నడవాలన్న అభిప్రాయంతో ఉన్నటువంటి పలు నాయకులతో కలిసి సువర్ణ రాజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సువర్ణ రాజు మాట్లాడుతూ.. లక్షల కోట్లు అప్పుల్లో కూరుకుపోయిన మన రాష్ట్రం మరల యధాస్థితికి రావాలంటే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకని అంటే ఆయన కష్టపడి సంపాదించిన సొంత డబ్బుని ఆత్మహత్య చేసుకున్న మూడువేల మంది కౌలు రైతులకి ఒక లక్ష చొప్పున 30 కోట్ల రూపాయలు ఇవ్వడం మనమందరం చూసాము, అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏదైనా జరిగితే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావాలా లేక దళితుల పట్ల అండగా ఉంటానని చెప్పి ఎంతోమంది దళితుల హత్యలు గాని అఘాయిత్యాల గురించి గానీ ఒక్కసారి కూడా స్పందించని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మనకి కావాలా అని అడుగుతున్నాను. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి మహనీయుడు పేరుని తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ గారి కంటే గొప్పవాడా ఈయన ఒక్కసారి ఆలోచించండి అని, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన భావాజాలం గురించి, రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి, పార్టీ బలోపేతం గురించి వివరించడం జరిగింది. అనంతరం గ్రామంలోని నాయకులు కార్యకర్తలు ఆయన ఆలోచన విధానాలు నచ్చి మేము పార్టీలో మీ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి గ్రామ కమిటీ నిర్మించుకుని, గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తామని మీకు మాటిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానేపల్లి నాగేశ్వర రావు, పిల్లి శ్రీనివాస్, పాక శ్రీను, అక్కబత్తుల గంగరాజు, కండి బోయిన దుర్గ ప్రసాద్, బొనిగే మురళీకృష్ణ, అంబేద్కర్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.