జనసేన పోరాటానికి స్పందించిన జిల్లా కలెక్టర్

  • ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు
  • సింగరాయకొండ పంచాయితీ కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్ కి చర్యలు.

కొండేపి, కలెక్టర్ ఆదేశాలతో సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లపై పంచాయితీ అధికారి నారాయణ రెడ్డి చర్యలు చేపట్టారు. సింగరాయకొండ గ్రామ ప్రజల తరుపున జనసేన పార్టీ నాయకులు సింగరాయకొండ గ్రామపంచాయతీ సంబంధిత అధికారులు వచ్చినప్పుడు, గ్రామపంచాయతీలో జరిగిన అవినీతిపై వివరించడం జరిగినది. అధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టిన డి ఎల్ పి ఒ సింగరాయకొండ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సిబ్బంది చూపిన రికార్డులను పరిశీలించారు. విచారణ సందర్భంగా సిబ్బంది రికార్డ్ లు సరిగా చూపలేక పోవడంతో ఆప్పుడు రికార్డ్ లు చూపలేక పోగా వారు చూపిన రికార్డ్ మేరకు పలు అవకతవకలను గుర్తించారు. పంచాయితీ నిధుల లావాదేవీలు జమా ఖర్చులు నిధుల వినియోగంపై విచారించి రికార్డ్ సరిగా చూపక పోవడంతో అందుబాటులో ఉన్న రికార్డ్ మేరకు తప్పులు జరిగాయని గుర్తించి జిల్లా అధికారులకు నివేదిక సమర్పించారు. విచారణలో తప్పును గుర్తించి సంబంధించి గ్రామ పంచాయితీలో కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్, సరైన రికార్డ్ లు చూప లేకపోవడంతో వారి నిర్లక్ష్యం బట్టబయలు అయింది. గ్రామ పంచాయితీలో చోటు చేసుకున్న అవకతవకలపై కొంత కాలంగా గ్రామ ప్రజలు, జనసేన పార్టీ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకు పోవడంతో సిబ్బంది నిర్వాకం బయటపడింది. జిల్లా అధికారులకు విచారణ అధికారి సమర్పించిన నివేదికతో సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం అవినీతికి దారి అయింది. సింగరాయకొండ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారి పరిపాలన నుండి నేటి వరకు విధులు నిర్వర్తించిన గ్రామ పంచాయితీ సిబ్బంది చేతివాటంతో ప్రభుత్వ నిధులు భారీగా దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టడం, శాఖా పరమైన చర్యలు తప్ప అవినీతికి అక్రమాలకు పాల్పడిన సిబ్బంది నుండి డబ్బు రికవరీ చేసిన దాఖలాలు లేకపోవడం అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం లేకుండా పోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి, మౌళిక సదుపాయాలు కల్పించేందుకు మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది జేబులు నింపుకోవడానికి అనువుగా మార్చుకున్నారు. ప్రజా ప్రతినిధులు ఉన్నా వారి కళ్ళకు గంతలు కట్టి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేయడంలో సిబ్బంది ఎంత దిట్టలో డి ఎల్ పి ఒ విచారణ నివేదిక బట్టబయలు చేసింది. డి ఎల్ పి ఒ నివేదిక జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సింగరాయకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి శరత్ బాబు, జూనియర్ అసిస్టెంట్ శైలజ, కాంట్రాక్ట్ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ లను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయితీ అధికారి నారాయణ రెడ్డి చర్యలు చేపట్టారు.