జనసేనాని స్పూర్తితో 2 లక్షల విరాళం ప్రకటించిన పితాని

  • 50 మంది జనసేనలో చేరిక
  • పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం, టి.కొత్తపల్లి గ్రామంలో మద్దింశెట్టి పురుషోత్తం ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేనపార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ హాజరయ్యారు. పితాని సమక్షంలో మండల కమిటీ, గ్రామకమిటీల ఎంపిక చెయడం జరిగింది. ఈ సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జనసేనపార్టీ ని బలోపేతం చేయాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు అందరూ సన్నద్ధమై ఉండాలని, పవన్ కళ్యాణ్ ఆశలను, ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళాలని అన్నారు. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ 5 కోట్లు రూపాయలు విరాళం ప్రకటించిన నేపధ్యంలో 2 లక్షల రూపాయలు తన వంతుగా పితాని బాలకృష్ణ ప్రకటించారు. వివిధ పార్టీల నుంచి సుమారు 50 మంది జనసేన పార్టీలో చేరారు, వారందరిని రాష్ట్ర పిఏసి సభ్యులు పితాని కండువా కప్పి పార్టులోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి రైతులు, గ్రామస్తులు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమి, సానబోయిన మల్లికార్జున రావు, తాళ్లూరి ప్రసాద్, మచ్చా నాగబాబు, జక్కంశెట్టి పండు, ఉండ్రు సత్తిబాబు బళ్ళ కుమార్, మోకా బాలప్రసాద్, పెమ్మాడి గంగాద్రి, అత్తిలి బాబురావు, సవరపు వెంకట్, సలాది రాజా,పితాని రామకృష్ణ, రాయపురెడ్డి బాబి, గిడ్డి రత్నశ్రీ, రేవు లక్ష్మి, చెల్లుబోయిన చినబాబు, కొప్పిశెట్టి గణేష్, నరహరి శెట్టి రాంబాబు, ఏసుబాబు, శివ, పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.