రంజాన్‌ పండుగ ప్రేమ, శాంతి, దానగుణానికి నిదర్శనం

విశాఖ, జనసేన పార్టీ 89వ వార్డు జనసైనికుల ఆధ్వర్యంలో అవినాష్, ఖాన్, హర్ష, విజయ్ ఆర్ధిక సహాయంతో రంజాన్ పండుగ సందర్భంగా 91 మంది ముస్లిం సోదరుల కుటుంబాలకు కొత్తపాలెం మసీదు దగ్గర “రంజాన్ తోఫా” నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది. ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, పశ్చిమ నియోజకవర్గం ముఖ్య నాయకులు పీలా రామకృష్ణ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 92, 91, 56 వార్డ్ జనసైనికులు మరియు 89 వార్డ్ జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 89వ వార్డు, పశ్చిమ నియోజకవర్గం జనసైనికులు ఎప్పుడు సేవా కార్యక్రమాలు ముందుంటారని, 91మంది పేద ముస్లిం కుటుంబాలను గుర్తించి వారికి జనసైనికులు ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందించడం జరిగిందని తెలియజేసారు. రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావిస్తారని క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనలు కలియిక రంజాన్ మాసం అన్నారు. మతాలను గౌరవించే నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి అడుగుజాడల్లో ముందుకు పోతూ సేవలందించడానికి జనసైనికులు, వీరమహిళలు వారితో పాటు మేమంతా కూడా ఎప్పుడూ ముందుంటారని డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, పశ్చిమ నియోజకవర్గ నాయకులు పిలా రామకృష్ణ తెలిపారు.