మొదటి ఓటు బంగారు భవిష్యత్తుకు తొలిమెట్టు

  • యువత తమమొదటి ఓటు జనసేన పార్టీకి వేసి రాష్ట్ర అభివృద్ధికి పునరంకితులు కావాలి
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: శుక్రవారం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత యువతతో మమేకమై జనసేన పార్టీ ఆధ్వర్యంలో నా మొదటిఓటు జనసేనకే అనే కార్యక్రమం ద్వారా వారికి ఓటు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన అత్యంత ముఖ్యమైనవాటిలో ఓటుహక్కు ప్రధాన మైనదని మన భవిష్యత్తుతో పాటు మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే మనం వేసే ఓటు పైన మనం ఎన్నుకోబడే నాయకుడి మీద ఆధారపడి ఉంటుందని కనుక 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు కి అప్లై చేసుకొని రాబోవు సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు హక్కుని వినియోగించుకొవాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో సంవత్సరం సంవత్సరానికి డిగ్రీలు, పీ.జీ లు పూర్తిచేసుకున్న యువత లక్షల్లో బయటకి వస్తున్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం అసమర్తతతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కల్పన లేక మరియు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి నిరుద్యోగులకు ఆశ చూపించి ఆదికారంలోకి వచ్చిన నాటినుండి జాబ్ క్యాలెండర్ ను గాలికి వదిలేసి 5 సంవత్సరాలు కాలయాపన చేసి నిరుద్యోగులు రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లేలా ఈ జగన్ మోహన్ రెడ్డి చేశారన్నారు. అలాగే ఇక్కడ నూతన ఉత్తేజంతో ఉన్న యువత మీ మొదటి ఓటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి వేయాలని ఆయన ఎటువంటి అవినీతిని గానీ అక్రమాలను గానీ సహించడని పైగా పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమపై ముఖ్యంగా మన అనంతపురం జిల్లాపై ఆయనకు ప్రత్యేక మైన అభిమానం ఉందని రాయలసీమలో వర్షాలు తక్కువ ఇక్కడ వర్షాలు తక్కువ ఉండడం వల్ల అనేకమంది ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని గ్రహించి రాయలసీమ ప్రాంతాన్ని పరిశ్రమలకు కేంద్రంగా రూపొందించి ఇక్కడ పారిశ్రామిక క్షేత్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పరని ఇక్కడ చదువు కున్న వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రభుత్వ శాఖలలో కాళిగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి మన ప్రాంతంలో వలసలను, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రతేక చెరవ తీసుకుంటామని తెలియజేస్తు మీ మొదటి ఓటు తప్పకుండా జనసేన టీడీపీ పార్టీలకు వేయాలని యువతను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.