దళిత జనుల జ్వాలా స్ఫూర్తి గుఱ్ఱం జాషువా: ఆళ్ళ హరి

  • గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల వివక్షపై తన అక్షరమే ఆయుధంగా పోరాడిన దళిత వర్గాల జ్వాలా స్ఫూర్తి, నవయుగ కవి గుఱ్ఱం జాషువా అని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం గుఱ్ఱం జాషువా 52వ వర్ధంతి సందర్భంగా కన్నా వారితోటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ.. ప్రజల మధ్య కుల వివక్ష ఉండకూడదని సమాజంలో అందరూ సమానమేననన్నది జనసేన ప్రధాన సిద్దాంతమని, అందుకు విశ్వనరుడైన గుఱ్ఱం జాషువా రచనలే స్ఫూర్తి అన్నారు. జాషువా కోరుకున్న సమసమాజ స్థాపనకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో జనసేన నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, బుడంపాడు కోటి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, మిద్దె నాగరాజు, ఇళ్ల శేషు, అలా కాసులు తదితరులు పాల్గొన్నారు.