స్వాతంత్ర్య ఫలాలు అందరికీ చేరువ కావాలి: కటికం అంకారావు

స్వాతంత్ర్య ఫలాలు ప్రజలందరికీ చేరువ కావాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురజాల పట్టణంలో గల అంకాలమ్మ గుడి సెంటర్ లో ఆయన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల ప్రాణత్యాగఫలమైన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన,బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజు కాబట్టే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటామని, ఆయన తెలియజేసారు. గణతంత్రం అనగా ప్రజలే ప్రభుత్వం , ప్రభుత్వమే ప్రజలని అర్ధం అని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా ప్రతీక్షణం గర్వపడతామని ఆయన అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలన ఎంతో మంది, ఈరోజున చక్కని జీవితం అనుభవిస్తున్నారని అనడంలో సందేహం లేదని ఆయన తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించే ప్రతిచోటా రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారిని కూడా స్మరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రసాద్, అజీస్, నాగేంద్రబాబు, చందు, నరసింహారావు, హనుమంతరావు, బాబు, శివ, పెద్దఎత్తున చిన్నారులు పాల్గొన్నారు.