భవిష్యత్తు జనసేనదే: వబ్బిన జనార్ధన శ్రీకాంత్

పెందుర్తి: 88వ వార్డ్ జనసేన పార్టీ బలోపేతం దిశగా, భవిష్యత్ కార్యచరణ కోసం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులతో దువ్వాడ జనసేన పార్టీ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో భాగంగా పలు ముఖ్యమైన నిర్యాలు తీసుకోవడం జరిగినది. ముఖ్యంగా వార్డులో ప్రతి గ్రామంలో కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియ మరియు తొలగించబడిన ఓటర్లు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టాలని. రాబోయే రోజుల్లో 88 వ వార్డులో విస్తృత స్థాయిలో జనసేన పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని. వార్డ్ లో గల గ్రామాల ప్రజల యొక్క సమస్యల పరిష్కార దిశగా వార్డ్ కంప్లైంట్ సెల్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్, తనుబుద్ధి రామారావు, సిరస పిల్ల అప్పారావు, చిన్నారావు, మురళి, రాజు, ప్రసాద్, గోపి, అభి, భాను, సర్వ సిద్దిరాజు, తేజ, గౌతమ్, మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.