వైభవంగా నాగోబా జాతర ప్రారంభం

ఆదివాసీల అతిపెద్ద జాతరైన కేస్లాపూర్ నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. గత అర్ధరాత్రి మెస్రం వంశస్తులు మహాపూజతో జాతరను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. నాగోబా జాతరకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.