- పార్టీ అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేరుస్తాం
- అన్ని నియోజకవర్గాలలో పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుస్తాం.
- రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తాం.
విజయవాడ నగరంతో పాటు, రూరల్ మండలం, తిరువూరు, నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో కూడా పార్టీ రోజు రోజుకి స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని పార్టీని రోజు రోజుకి బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. ఆదివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 25 వ డివిజన్ నుండి ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ (నాని) తో పాటు ఆయన సన్నిహితులను, సామినేని ఉదయభాను పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. తొలుత విజయ్ టాకీస్ దగ్గర హుస్సేన్ సాహెద్ వీధి నుండి భారీ ర్యాలీగా వందలాంది మంది జన సైనికులతో కలిసి ఊరేగింపుగా కందుకూరి కళ్యాణ మండపానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ మొట్టమొదటిగా తనను రాజకీయాల్లో ప్రోత్సహించిన వారు వంగవీటి రంగా గారు 1986 లో యువజన కాంగ్రెసు పార్టీ అధ్యక్షులుగా నియమించారని,అనంతరం దివంగత నేత మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. రానున్న మున్సిపల్,పంచాయతీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారికి పార్టీలో ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ (నాని) మాట్లాడుతూ ఉదయభాను నేతృత్వంలో తన వంతుగా పార్టీ బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అందరికీ తనవంతుగా ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సేవలు అందిస్తానని పేర్కొన్నారు.
కొంపల్లి అరుణ్ కుమార్ (నాని) గారితో పాటు దొండపాటి శేషుబాబు,కాజా మొయిద్దీన్ షేక్, గంజి సునీల్, దినేష్ నాయుడు, తోట అభిలాష్, పామర్తి, ఎమ్. సతీష్, మోహన్, దిలీప్, కిరణ్, బబ్లూ తదితరులు జనసేన పార్టీలో చేరారు .
ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, కృష్ణ పెన్నా రీజియన్ కో-ఆర్డినేటర్ రావి సౌజన్య, పీఏసీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, కార్పొరేటర్ మహదేవపు అప్పాజీ, రూరల్ మండలం అధ్యక్షులు పొదిలి దుర్గారావు, జనసేన పార్టీ సానుభూతులు ప్రముఖ వైద్యులు కొండవీటి సంతోష్ కృష్ణ, గాదిరెడ్డి అమ్ములు, అశోక్, శ్రీకాంత్ (స్వామి) పాల్గొన్నారు.
Share this content:
Post Comment