ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగానే కొనసాగించాలి

  • కొత్తగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ బాలికల కళాశాలలను అదనంగా ఏర్పాటు చేయాలి అన్ని ఐక్య విద్యార్థి సంఘాలు. తెలుగు యువత టి.ఎన్.ఎస్.ఎఫ్, జనసేన పార్టీ డి.హెచ్.పి.ఎస్ డిమాండ్.

సత్యసాయి జిల్లా మడకశిర మండల కేంద్రంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎంతోమంది విద్యార్థులను అధికారులుగా, ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగా కాకుండా చేయడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, కొత్తగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలపకుండా మడకశిర ప్రాంతంలోనే అదనంగా ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందే అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాల రూపంలో అధికారులకు విన్నవించిన ప్రభుత్వ అధికారులు మాత్రం దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కళాశాలలో మొత్తం దాదాపుగా 500 మంది విద్యార్థుల వరకు చదువుకుంటున్నారు అకస్మాత్తుగా కో ఎడ్యుకేషన్ కళాశాలను తీసివేస్తూ జీవో నెంబర్ 85ను విడుదల చేయడం దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కొత్తగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను మడకశిర ప్రాంతంలోని అదనంగా ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల జనసేనఆధ్వర్యంలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తు మడకశిర తహసిల్దార్ ఆనంద్ కుమార్ కి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. స్పందించినటువంటి మడకశిర తహసిల్దార్ ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు ఉమేష్ నాయక్ నవీన్ హేమంత్ హరి నవీన్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయినాథ్ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మురళి వినయ్ రంగస్వామి తెలుగు యువత బాలకృష్ణ నవీన్ జనసేన ఐటీ విభాగం కోఆర్డినేటర్ ప్రసాద్ మండల అధ్యక్షుడు టి.ఏ శివాజీ, యశ్వంత్, కళ్యాణ్, పవన్ కళ్యాణ్, రంగనాథ్, పవన్ కుమార్, నాగభూషణ, డి.హెచ్.పి.ఎస్ హనుమంతు ఎమ్మెస్ రఘు ఎస్ఎఫ్ఐ వీరేష, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.