జనసేన శ్రమదానంతో ప్రభుత్వం సిగ్గు పడాలి

ద్వారపూడి మండపేట రహదారి నిర్మాణం

మండపేట నియోజకవర్గం, అత్యంత భారీ మెజారిటీతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైస్సార్ ప్రభుత్వం ఈ రాష్ట్ర రహదారుల స్థితి చూసి సిగ్గుపడాలని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో మండపేట ద్వారపూడి ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై శ్రమదానం నిర్వహించారు. రోడ్ మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు రాక పోకలు సాగించే ఈ రోడ్ దినస్థితిపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇదే కాకుండా జిల్లా లో అన్ని రోడ్ లు ఇలాగే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను మరమ్మత్తు చేపట్టాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ గతంలో సామాజిక మాధ్యమాలు వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిందన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి మరమ్మత్తులు చేపట్టడకపోవడంతో  అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మత్తులు చేశాయని పేర్కొన్నారు. కాగా  ప్రభుత్వం ఇప్పటికీ పాడైన రహదారుల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడుతుందని తెలిపారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని ఈ నిరసనల వల్ల రాజకీయ లబ్ధి వస్తుందని కాదని ప్రజలబాగు కోసం రోడ్లపై శ్రమదానం చేస్తున్నామని మనోహర్ వివరించారు. ఏపీలో రహదారుల పరిస్థితి గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికీ అధినేత పవన్ తీసుకువెళ్లారని పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వానికి సమయం ఇచ్చినా స్పందించలేదన్నారు. జనసేన చేపట్టిన శ్రమదానం కార్యక్రమంతో ప్రభుత్వం స్పందించిన తీరు అప్పట్లో అందరూ చూశారని  గుర్తు చేశారు. త్వరలో అధినేత పవన్  జిల్లాల పర్యటనలో పాల్గొంటారని వెల్లడించారు. సామాన్య ప్రజల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా జనసేన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనసేన అధినేత గతంలో నిర్వహించిన శ్రమదానం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. శ్రమదాన స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా రోడ్లు బాగు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులకు తక్షణ న్యాయం, ఓటిఎస్ వత్తిళ్ళు వంటి అంశాలతో పాటు జిల్లాల వారీగా ఉన్న సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శ్రమదానం అనంతరం ఆ రహదారి పై పాదయాత్ర చేశారు. అక్కడ రైతులు, మహిళలు, యువకులతో వేర్వేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, కాకినాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్, జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు, శెట్టిబత్తుల రాజబాబు, తాళ్ళ డేవిడ్, సూరంపూడి సత్య, బండారు శ్రీనివాస్, పొలిశెట్టి చంద్ర శేఖర్,పంతం నానాజి అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.