అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి

  • చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు

అమలాపురం: అంగన్వాడీ వర్కర్ల కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పరిమితి 62 సంవత్సరాల వరకు పెంచాలని, అంగన్ వాడీ ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని, అంగన్ వాడీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం అందరికీ గ్రాడ్యుటీ ఇవ్వాలని, భీమా సౌకర్యం కల్పించాలని, అంగన్ వాడీ సెంటర్లలకు నాణ్యమైన సరకులు సరఫరా చేయాలనే తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా స్థానిక అమలాపురం ఐ సి డి ఎస్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్ల శిబిరాన్ని జనసేనపార్టీ తరపున చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు సందర్శించి వారికి నైతిక మద్దతు తెలియజేయడం జరిగింది. శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం నెరవేర్చే వరకు వారు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే జనసేన, తెలుగు దేశం ప్రభుత్వం రానుందని మా ప్రభుత్వం వచ్చినవెంటనే అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున చిందాడగరువు జనసేన పార్టీ ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లు చేస్తున్న కార్యక్రమంలో కూడా పాల్గొని వారి న్యాయమైన డిమాండ్లను పదివేల రూపాయల నుండి 26 వేల వరకు జీతం పెంచి వారిని పూర్తి ఉద్యోగులుగా గుర్తించి వారికి న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.