అంగనవాడీ కార్యకర్తల డిమాండ్ లు ప్రభుత్వం వెంటనే తీర్చాలి

పోలవరం నియోజకవర్గం: కొయ్యలగూడెం పట్టణంలో గత 8రోజులుగా సాగుతున్న అంగనవాడి సమస్యల పరిష్కారానికి చేస్తున్న నిరావధిక సమ్మెకు నేడు మండల అధ్యక్షులు తోట రవి గారు మరియు టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ చిర్రి బాలరాజు సమ్మెలో పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు వారి సమస్యలు చిర్రి బాలరాజు గారికి విన్నవించుకున్నారు . అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలు కొట్టడం విస్మయానికి గురి చేసిందన్నారు. దేవాలయంలా భావించే అంగన్వాడి కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడం ఏంటని మండిపడ్డారు. అంగన్వాడీలు కోరుకునే 26,000 కనీస వేతనం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాటిట్యూడ్ అమల్లోకి తీసుకు రావడం, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, వేతనాల్లో సగం పింఛన్, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించడం, లబ్ధిదారులకు సరైన సరుకులు అందించడం తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వంతీర్చాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలు తీర్చడంలో మద్దతుగా నిలిచినటువంటి జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు గారికి మండల అధ్యక్షులు తోట రవి గారికి, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను గారికి, కార్యకర్తలకు నాయకులకు అందరికీ సిఐటియు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సతీష్, ప్రగడ రమేష్, చావ్వ రాము, గొలిశెట్టి శ్రీనివాస్, కొట్టు ఏడుకొండలు, మేడిన కన్నయ్య, పరిందల నాని, వామిశెట్టి మధు, కంకిపాటి వంశీ, నక్కా రాము, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.