కోనసీమ జిల్లా, అమలాపురం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు మోకా వెంకట సుబ్బారావు, దున్నాల వేణు, గన్నవరపు సూర్య భాస్కరరావు, దున్నాల దుర్గ, గోకరకొండ లక్ష్మణరావు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈఓ యర్రా వెంకటేశ్వరరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పట్టణ ప్రముఖులు యిండుగులు శ్రీనివాస్ తో పాటు ఆయన సోదరులు కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, మున్సిపల్ ప్రతిపక్షం నేత ఏడిద శ్రీను, దెందుకూరి సత్తిబాబు రాజు తిక్కిరెడ్డి నేతాజీ, దేశంశెట్టి లక్ష్మీనారాయణ, బోనం సత్తిబాబు, ర్యాలి వెంకట్రావు, పడాల శ్రీదేవి తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
- అమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న రాష్ట్రమంత్రి వాసంశెట్టి సుభాష్
వివిధ కళారూపాలను ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించిన మంత్రి. ఉత్సవ కమిటీ చైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న, గంధం పల్లంరాజు, వాసంశెట్టి చినబాబు, ఈఓ యర్రా వెంకటేశ్వరరావు, నిమ్మకాయల సత్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Share this content:
Post Comment